ప్రతి అయ్యప్ప భక్తుడు పాషా దీక్షకు మద్దతు ఇవ్వాలి 

– గురు స్వామి మల్లికార్జున్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
రాష్ట్రంలోని ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు మండల పరిధిలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ మహమూద్ పాషా ఫలాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మర్కోడు గ్రామానికి చెందిన గురు స్వామి మల్లికార్జున్ కోరారు. ఈ మేరకు శనివారం మర్కోడు గ్రామంలోని అయ్యప్ప స్వామి భక్త బృందం పాషా ఇంటికి చేరుకుని ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మహమూద్ పాషా 108 రోజుల దీక్ష సఫలీకృతం అవ్వాలని భక్త బృందం ఆకాంక్షించింది. ఈ కార్యక్రమంలో భక్తులు పొదిల రాము, మన్యం సుబ్బారావు, కోనేటి వీరభద్ర చారి, భానోత్ నాగేశ్వరరావు, సద్గుణ చారి, సాగర్, నవజీవన్, తదితరులు  పాల్గొన్నారు.