నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రతి చిన్నారికి వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలని, ప్రతి శిశువు టీకాలను యువిన్ పోర్టల్ ఆన్లైన్ చేయాలని భువనగిరి మండల వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ యామిని శృతి అన్నారు. శనివారం భువనగిరి మండలంలోని హనుమాపురం మదిరే (కురుమ గూడెం ), బి ఎన్ తిమ్మాపురంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించి, మాట్లాడారు. ప్రతి సెషన్ లో ఏ ఈ ఎఫ్ ఐ కిట్,డ్యూ లిస్టు, ప్రతి ఆంటీజన్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. త్వరలో వయోజనులకు బీసీజీ టీకాను కార్యక్రమాన్ని నిర్వహణకు సంబంధించిన టార్గెట్ లిస్టు సిద్ధం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లెదవఖాన డాక్టర్ విజయ దుర్గ, కిరణ్, జ్యోతి ,సునంద మహమూనా,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.