రెండున్నర సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి 

నవతెలంగాణ-చేర్యాల 
రెండున్నర సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డను  అంగన్వాడీ కేంద్రాలలో చేర్చి ఐదేళ్లు నిండే వరకు అందులో ఉంచడం వల్ల  క్రమశిక్షణ, ఆట పాటల తోపాటు విద్య అలబడుతుందని చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప, ఐసీడీస్ సూపర్ వైజర్ నాగమణి తెలిపారు.అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని గురువారం చేర్యాల పట్టణ కేంద్రంలో 3,6,11అంగన్వాడీ కేంద్రాలతో కలిపి చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నర్సరీ,ఎల్ కె జి, యు కె జి,అంగన్వాడి కేంద్రాలలోనే పూర్తి అవుతుందని పిల్లల తల్లులకు వివరించారు. గర్భిణీ బాలింతలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి భోజనం చేయడం వల్ల, కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు.  పిల్లలు,గర్భిణీ, బాలింతలకు శుభ్రత గూర్చి  ఏఎన్ఎం వివరించారు.అనంతరం అంగన్వాడి టీచర్లు వీధిలో ర్యాలీ తీస్తూ రెండున్నర సంవత్సరాల పిల్లలను గుర్తించి వాళ్ళ ఇళ్లను సందర్శించి పిల్లలను నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శోభ,తాటి పాముల కృష్ణవేణి,రేణుక హెల్పర్ బాల్ లక్ష్మి, ఆశా వర్కర్లు  నాగమణి రమ ,గర్భిణీలు బాలింతలు పిల్లల తల్లులు పాల్గొన్నారు.