భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పులోంగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఆదివారం నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అందించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. 1891 ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరి జిల్లా మారుమూల ప్రాంతమైన అంబే వాడలో బీమాబాయి, రాంజీ దంపతులకు జన్మించి దేశ ప్రజల జీవితాలలో వెలుగులు దిద్దిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. భారతదేశంలోని నిమ్న వర్గాల ప్రతినిధిగా అంటరానితనానికి అస్పృశ్యతకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించి పేద ప్రజలలో చైతన్యాన్ని రగిలించడమే కాకుండా భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించిన ఆదర్శమూర్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన ప్రపంచ దేశాలు ఏప్రిల్ 14 ను ఐక్యరాజ్యసమితి అధికారికంగా అంతర్జాతీయ జ్ఞాన దినోత్సవాన్ని జరుపుతుంది అని అందరికీ తెలిసిందే అని అన్నారు . ఆయన జన్మదిన భారతదేశంలో కొందరు సమానత్వ దినోత్సవం అని కూడా పిలుస్తారు. స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అంటే అనేక విలువలను అందించిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలో కుల నిర్మూలన కోసం, నిన్న వర్గాలైన దళితుల కోసం నెట్టివేయబడ్డ ప్రజల కోసం పోరాటాలు నిర్వహించారు. బ్రాహ్మణీయ అగ్రవర్ణాల ఆదిపత్య భావాజాలనికి బలి అయిన ప్రజల కోసం కుల నిర్మూలనను కూకటి వేళ్లతో పెకిలించడమే తన కర్తవ్యం గా ఎంచుకున్నారు.కానీ అంబేడ్కర్ కలలు కన్నా సమాజాన్ని నిర్మించడం లో కేంద్ర ప్రభుత్వం విఫలమవడమే కాకుండ భారత రాజ్యాంగన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని తిప్పికొట్టడమే మనం అంబేడ్కర్ కి ఇచ్చే నిజమేనా ఘన నివాళి. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పోషమైన మహేష్, జిల్లా సహాయ కార్యదర్శి దీపిక, నగర నాయకులు ఆజాద్, కార్తీక్ తదితర నాయకులు పాల్గొన్నారు.