నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా పనిచేస్తు భారత కమ్యూనిస్టు పార్టీ ని బలోపేతం చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీపీఐకి కంచుకోట అయినటువంటి హుస్నాబాద్ లో ఎప్పటి లాగే పార్టీ నిర్మాణం కోసం గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సీపీఐ నాయకత్వం కృషి చేయాలని కోరారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి వరకు హుస్నాబాద్ ప్రాంతంలో సీపీఐ అనేక పోరాటాలు,త్యాగాలు చేసిన చరిత్ర ఉందన్నారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినతుల ద్వారా కానీ ఉద్యమాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ముందు ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాగీర్ సత్యనారాయణ, యెడల వనేష్, పొదిల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.