నవ తెలంగాణ -నేరేడ్ మెట్
దళిత బంధు పథకం అధికార పార్టీ నాయకులకే కాకుండా ప్రతీ దళితునికి ఇవ్వాలని కాంగ్రెస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన హాత్ సే హాథ్ జోడో యాత్ర గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .కేసీఆర్ సర్కార్ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలని, దళిత బంధు పథకాన్ని ప్రతీ దళితునికి చెందే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేస్తానని చెప్పారు. ఆడపడుచులకు గ్యాస్ రూ 500 ల కే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువకులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ధోని రమేష్, నిమ్మ అశోక్ రెడ్డి ,వెంకటేష్ యాదవ్, సీఎల్ యాదగిరి, అప్సర్, పవన్, సంజీవ్ కుమార్, సూర్య ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీపాల్ రెడ్డి, సంజీవ కుమార్ రవీందర్ రెడ్డి బలరాం, పాతాలు, సాయి ,పాండు, వీనస్ మేరీ ,పద్మ, విజయలక్ష్మి నిర్మల, సుభాషిని పాల్గొన్నారు.