
నవతెలంగాణ – భువనగిరి రూరల్
ఉపాధి హామీ పనులలో కూలీల శాతం పెరిగేలా, అర్హులైన ప్రతి ఒక్కరికి పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి అధికారులకు సూచించారు. శనివారం నాడు ఆయన ఆత్మకూరు ఎం. మండలం కపిరాయిపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. వంద రోజులు పని కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని, గ్రామ అవసరాలను బట్టి పనులను గుర్తించాలని, అధిక శాతం కూలీలను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు. గ్రామంలో టాక్స్ కలెక్షన్ గురించి పంచాయతీ సెక్రెటరీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నర్సరీలో జెర్మినేషన్ కానీ చోట కొత్త విత్తనాలు నాటాలని, మొక్కల సంరక్షణ పనులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కపిరాజుపల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ సహేష్, ఫీల్డ్ అసిస్టెంట్ నర్మద ఉన్నారు.