ప్రతి జిల్లాకు ప్రాతినిథ్యం ఉండాలి

– రాష్ట్ర క్రికెట్‌ జట్టుపై టీడీసీఏ అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్‌ అభివద్ది చెందాలంటే ప్రతి జిల్లాకు ఆధునాతన మౌళిక సదుపాయాలతో కూడిన అకాడమీలు అవసరమని, రాష్ట్ర జట్టు అంటే ప్రతి జిల్లా నుంచి క్రికెటర్లకు ప్రాతినిథ్యం ఉండాలని తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) అధ్యక్షుడు, శాట్‌ మాజీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. . ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘తెలంగాణ క్రికెట్‌ దశ-దిశ’ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శాట్‌ చైర్మన్‌ కే. శివసేనా రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణలో జిల్లాలో క్రికెట్‌ అభివద్ది కుంటుపడింది. ప్రతిభావంతులైన గ్రామీణ క్రికెటర్లకు అవకాశాలు లభించటం లేదు. జిల్లాల్లో క్రికెట్‌ అభివద్దికి తెలంగాణ జిల్లాల క్రికెట్‌ సంఘం (టీడీసీఏ) సంకల్పం తీసుకోవటం ఆహ్వానిస్తున్నాం. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అవినీతిలో మునిగింది. గ్రామీణ క్రికెట్‌ను పూర్తిగా నిర్లక్షం చేస్తోంది. ఈ విషయంపై బీసీసీఐకి సైతం లేఖ రాసేందుకు వెనుకాడబోం. తెలంగాణ జిల్లాల్లో క్రికెట్‌ అభివద్దికి మరిన్ని సంఘాలు ముందుకు రావాలని’ శివసేనా రెడ్డి అన్నారు. అల్లీపురం వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ..’ తెలంగాణలో గ్రామీణ క్రికెట్‌ దశాబ్దాలుగా కుంటుపడింది. రాష్ట్ర క్రికెట్‌ జట్టు అంటే ప్రతి జిల్లాకు ప్రాతినిథ్యం లభించేలా ఉండాలి. అందుకు టీడీసీఏ తరఫున రాజీలేని కషి చేస్తాం. అందరి మద్దతుతో బీసీసీఐ గుర్తింపు సైతం తీసుకొస్తామని’ తెలిపారు. టీడీసీఏ జిల్లా సంఘాల ప్రతినిధులు, మాజీ క్రికెటర్లు సహా పెటాటిఎస్‌ అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు.