నవతెలంగాణ-తాండూర్ రూరల్
పంట సాగు చేసినా ప్రతి రైతూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని ఏఈఓ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తాండూరు మండలం బెల్కటూరు గ్రామంలో సాగు చేసిన పంటలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సాగు చేసిన ప్రతి రైతూ విధిగా నమోదు చేసుకోవాలన్నారు, పంటలు విక్రయించాలంటే ఖచ్చి తంగా ఆన్‌లైన్‌లో నమోదై ఉండాల న్నారు రైతులు. అలా చేయకుండా విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు, పంటల, నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.