నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా ప్రజా శ్రేయస్సు కోసమే రూపొందిస్తామని,అందుకు అనుగుణంగా స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో దానిని కార్యాచరణ లో అమలు చేయాలని మండల పరిషత్ ప్రత్యేక అధికారి,పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ తెలిపారు. స్వచ్ఛదనం – పచ్చదనం లో రెండోరోజు మంగళవారం త్రాగునీటి పరీక్షలను మిషన్ భగీరథ డీ.ఈ సలీమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు శుద్ధి జలం అందించేందుకు మిషన్ భగీరథ యంత్రాంగం నిరంతరం పనిచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎం.పీ.ఈ.ఓ ఎస్.ప్రసాద్ రావు,కార్యదర్శి శ్రీరామమూర్తి,పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.