ప్రతి ఇంటి కథ

ప్రతి ఇంటి కథరాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్‌ పతాకంపై చల్లపల్లి చలపతి రావు దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్‌ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్‌ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగ దరియా’. ఈ సినిమాను ఈనెల 12న గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నవీన్‌ చంద్ర ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్‌ టికెట్‌ను కోనుగోలు చేశారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ,’ మా డైరెక్టర్‌ సినిమా గురించి ట్రైలర్‌లోనే మొత్తం చెప్పేశాడు. ఫెయిల్యూర్‌ అనేది చాలా డేంజర్‌ అని చూపించాడు. ఈ చిత్రంలో నాకు ముగ్గురు కొడుకులుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. కాలేజ్‌ లెక్చరర్‌గా పని చేసి అందరికీ నీతులు చెబుతాను. కానీ నా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతాను. సోషల్‌ మీడియా, ప్రస్తుత బిజీ లైఫ్‌లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య రిలేషన్‌ సరిగ్గా ఉండటం లేదు. కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి టైంలో పిల్లలు చెడు బాట పట్టొచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు మోరల్‌ సపోర్ట్‌ ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు’ అని అన్నారు. ‘మా డైరెక్టర్‌ పండు వచ్చాకే ఈ సినిమా టీమ్‌ ఫామ్‌ అయింది. ఈ చిత్రానికి మహేష్‌ చాలా కష్టపడ్డాడు. మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎపి చాలా మంచి సంగీతాన్ని ఇచ్చారు. డీఓపీ సిద్దు పీసీ శ్రీరామ్‌ వద్ద పని చేశారు. రాంబాబు, కడలి అద్భుతమైన లిరిక్స్‌ ఇచ్చారు. రాజా రవీంద్ర చాలా సపోర్ట్‌ చేస్తున్నారు’ అని నిర్మాత శరత్‌ చంద్ర చల్లపల్లి చెప్పారు. దర్శకుడు పండు మాట్లాడుతూ, ‘సమానత్వం అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. నన్ను నమ్మి చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చిన నిర్మాతలు శరత్‌కి, ఉమాదేవీకి థ్యాంక్స్‌. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని తెలిపారు. ‘నాకు ఈ చిత్రంలో పండు మంచి పాత్రను ఇచ్చారు.
మేనేజర్‌ అయిన నన్ను మా నిర్మాత ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా మార్చారు. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’ అని ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత మహేష్‌ చెప్పారు.