నవతెలంగాణ – సిరిసిల్ల
ప్రతి ఉదయాన… ప్రతి హృదయంలో… ఉషోదయాన్ని నింపుతూ… అనుదినం జన స్వరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రచురిస్తూ… పరిష్కారం కోసం అలుపెరగని కృషి చేస్తున్న నవ తెలంగాణ యాజమాన్యానికి పాత్రికేయులకు సిబ్బందికి నా శుభాకాంక్షలు. నవ తెలంగాణ పత్రిక లక్ష్యసాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా వార్తా సేకరణ యంత్రాంగాన్ని ఏర్పరుచుకుని ప్రజల సహాయంతో వార్తను సచిత్రంగా వేగంగా చేరవేయగల యంత్రాలను సమకూర్చుకుంది జాతీయ అంతర్జాతీయ పరిణామాలకు విశ్లేషణ యుక్తంగా పాఠకులకు అందించడాన్ని కొనసాగిస్తూనే స్థానిక వార్తలకు పెద్దపీట వేసింది రాజకీయ భేదాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వార్తా విలువ కలిగిన ప్రతి ఘటన నవ తెలంగాణ వార్తగా చూపెడుతూ వస్తుంది తెలంగాణ గడ్డ నుంచి వెలువడుతున్న ప్రధాన పత్రికల్లో నవ తెలంగాణ ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకుంది నిజాయితీ నిబద్దతతే పునాదులుగా పయనిస్తుంది ప్రజల దృష్టితోనే వార్తా విశ్లేషణాలు వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి ప్రజాస్వామ్యంలో విలువలకు కట్టుబడే వార్తా కథనాలు వెలువడుతున్నాయి ఆర్థికంగా అట్టడుగునున్న ప్రజల గొంతుగా నిలుస్తున్న వెలుగుదీపిక అందరి నవ తెలంగాణ పత్రిక అని చెప్పవచ్చు పురం జిల్లా సమస్యలను ప్రతిబింబించేలా కథనాలు రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తుంది నవ తెలంగాణ ప్రజలను చైతన్యవంతులుగా మారుస్తూ ప్రత్యేక కథనాలు శీర్షికలు ప్రచురిస్తూ కార్మిక వర్గానికి బాసటగా నిలుస్తున్న పత్రిక నవ తెలంగాణకు మనస్ఫూర్తిగా తొమ్మిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను