నవతెలంగాణ-రామగిరి
ప్రతి గ్రామ పంచాయితీ ఆస్తులను సమర్ధవంతంగా వినియోగంలోకి తేవాలని, జిల్లా పంచాయతీ అధికారి లత అన్నారు. ఈ మేరకు రామగిరి మండలంలోని పన్నూరు. గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లాలోని 266 గ్రామ పంచాయితీ లు వాటి ముఖ్య ఆస్తులైన నర్సరీలు,క్రీడా ప్రాంగణాలు,పల్లె ప్రకృతి వణాలు,వైకుంఠ దామాలు గ్రామాల్లోని ప్రజలందరికీ ఉపయోగ పడేలా కార్యదర్శులు,ప్రత్యేక అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ పన్నూర్ గ్రామ పంచాయితీ లోని నర్సరీ , ప్రాంగణం, వైకుంఠ దామాలను జిల్లా పంచాయతీ అధికారి లత సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఎం సమ్మిరెడ్డి, కార్యదర్శి సరిత, కారోబార్ పెరుమాండ్ల అభి, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.