
ప్రతి వ్యక్తి తన వంతుగా రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 5 నుండి 12 వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పచ్చదనం పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో అమృత సరోవర్ సైట్ ను సందర్శించి మొక్కలు నాటారు. ఇంకుడు గుంతల నిర్మాణము మొక్కల పెంపకము వర్మీ కంపోస్టు తయారీ ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధం పై అవగాహన కల్పించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు వైకుంఠధామాలు క్రీడా ప్రాంగణాలు స్కూళ్లు అంగన్వాడీ కేంద్రాలు , కమ్యూనిటీ స్థలాలు, పబ్లిక్ స్థలాలు, రోడ్డులు, వీధులు అన్నింటిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఉపాధి హామీ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీవో జీ నరసయ్య , టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు సంబంధిత పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.