వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండలంలోని నాగపూర్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనమహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని, మొక్కలను సంరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి సంధ్యకు సూచించారు.మొక్కలు నాటితే సరిపోదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.మొక్కను సంరక్షించేందుకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అన్నారు. మనం నాటిన మొక్కలే వృక్షాలై మన భవిష్యత్తు తరాలకు ప్రాణ వాయువును అందిస్తాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంధ్య, తదితరులు పాల్గొన్నారు.