
నవతెలంగాణ-భైంసా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద వానికి రేషన్ కార్డు ఇవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. హైదరాబాదులో నిర్వహించిన బి జె ఎల్ పి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత పది సంవత్సరాల కాలంగా అప్పటి ఇప్పటి ప్రభుత్వాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడం మూలంగా ప్రజానీకానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. 10 సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఏర్పడ్డాయని, వారికి రేషన్ కార్డు ఇవ్వకపోవడం మూలంగా సంక్షేమ పథకాలకు దూరమయ్యారన్నారు. ప్రభుత్వం త్వరితగతిన రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, బిజెపి ఎంపిలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కలిసి రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
|