– వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రతీ గర్భిణీ పౌష్టికాహారం తీసుకోవాలని వికారాబా ద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. వికారాబాద్ పోషణ మాసంపై ఇంటింటా పోషణ సంబురాలు, పోషణకు ఐదు సూత్రాలు, పోస్టర్ను సంబంధిత శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీ య పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి కి సరైన పోషణ, పోషకాహారము, త్రాగునీరు, పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి తల్లీ బిడ్డలకు సరైన పోషణ ఆహారం ఉండాలని అన్నారు. గ్రా మాల్లో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యక ర్తలు గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, వారి కాన్పులు అయ్యేవరకు పర్యవేక్షణ సాగిస్తూ పౌష్టికాహారం అందజే యాలన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేతావత్ లలితా కుమారి మాట్లాడుతూ పోషణ మాసం సెప్టెంబర్ మొదటివారం నుంచి నెలాఖరు వరకు మహి ళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో (కొడంగల్, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్) 1107 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీటి పరిధిలో గర్భిణీలు 7,007, బాలింతలు 3,896, జీరో టు మూడు సంవత్సరాల పిల్లలు 3,4586, మూడు నుంచి ఆరేండ్ల పిల్లల సంఖ్య 21,596 లబ్ది పొందుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.