ప్రతి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలి: తహసీల్ధార్

నవతెలంగాణ – ధర్మసాగర్
మండలంలోని రైతులకు ప్రతి విత్తనాలు అందుబాటులో విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్ధార్ సదానందం అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మన గ్రోమోర్, ఇతర విత్తనాల విక్రియ కేంద్రాలను మండల పరిధిలోని మూడు శాఖల విభాగాల్లోని అధికారులు మూకుమ్మడిగా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పడి మండల పరిధిలోని సీడ్స్, విత్తనాల షాపులను  తనిఖీలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా తాసిల్దార్ సదానందం మాట్లాడుతూ విత్తనాలను కల్తీ లేకుండా రైతులకు అందించాలని అన్నారు. వీడి లూజు విత్తనాలను రైతులకు అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని షాప్ యజమానులకు సూచించారు. అనంతరం ఏవో పద్మ మాట్లాడుతూ విత్తనాలను ఎమ్మార్పీ రేటు ను అధికమించి అమ్మ రాదని, విత్తనాల వివరాలను ఎప్పటికప్పుడు షాపు ముందు బ్లాక్ బోర్డ్ పై నమోదు చేయాలని అన్నారు. రైతులు కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదులను తప్పకుండా ఇవ్వాలని అన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలను రైతుల పేరు మీద నమోదు చేయాలని సూచించారు. కాలం చెల్లిన విత్తనాలను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ షాపు విక్రయించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక సీఐ మహేందర్ మాట్లాడుతూ రైతుకు నష్టం వాటిల్లే ఎలాంటి విత్తనాలను అమ్మిన కఠిన చర్యలు తీసుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ తాసిల్దార్ వ్యవసాయ శాఖల అధికారు అధికారులు మండలంలోని ఆయా షాపులను టాస్క్ ఫోర్స్ టీం గా తనిఖీలు నిర్వహించారు.