మండలంలోని ప్రభుత్వ పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి ఉన్నత ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు ఉపాధ్యాయులకు సూచించినట్టు తెలిపారు. మండలంలోని ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి ఒక్కరు బ్రతికించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు,నంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పదవ తరగతిలో విద్యార్థులు ఉన్నత ఫలితాలను సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక బద్ధంగా విద్యాబోధన జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ రాందాస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.