
నవతెలంగాణ-చండూరు : ప్రతి విద్యార్థి దేశ భక్తి తోపాటు సామాజిక బాధ్యత వ్యహరించాలని చండూర్ సి .ఐ, వెంకటయ్య అన్నారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలో ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా స్థానిక గాంధీజీ విద్యార్థులకు ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిఐ మాట్లాడుతూ పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు ప్రజలకు ఉపయోగ పడేవి, ఆపిసర్ లకు ఉపయోగపడే ఆయుధాల గురించి తెలిపారు. ప్రజా ప్రతినిధుల భద్రత కోసం తీసు కోవాలని జాగ్రత్తల గురించి చెప్పారు. పోలీసుల విధుల గురించి క్లిప్తంగా వివరించారు. ఈ కార్య క్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు , ఉపాధ్యాయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.