ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి: డిప్యూటీ డిఎంహెచ్ఒ చంద్రశేఖర్

నవతెలంగాణ-భిక్కనూర్
ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత పరిశుభ్రతను, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్ విద్యార్థులకు సూచించారు. గురువారం మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. అనంతరం విద్యార్థులకు తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ యేమిమా, హెచ్ఈఓ వెంకటరమణ, ఏఎన్ఎం యాదమ్మ, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, హెచ్ఎస్ బసవయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.