ప్రతి విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుంది: గోసుల వెంకన్న

నవతెలంగాణ – తుంగతుర్తి
సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పదని, ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మించబడుతుందని గుడితండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోసుల వెంకన్న అన్నారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ఈ మేరకు విద్యార్థులు ఇష్టపడి పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కలెక్టర్ గా జీ.తూనిగ,డీఈఓగా జీ.రూప,ఎంఈఓ గా జి తులసి ప్రధానోపాధ్యాయులుగా జి రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులుగా జి మోనిత,జి. లాస్య, జి. సుశాంత్ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు గన్న ప్రసాద్,అంగన్వాడీ టీచర్ గుగులోతు రజిత,గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.