నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం స్వచ్ఛదనం పచ్చదనంతో కలకలలాడే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు నియోజకవర్గం ప్రజలకు విన్నవించారు ప్రతి ప్రాంతాన్నీ ప్రకృతి వనం చేసే ప్రయత్నం.స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం, ఆగష్టు 5 నుండి 9 వరకు ఐదు రోజుల కార్యక్రమం కొనసాగుతుందని ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని కోరారు,ఇంటింటికీ మొక్కల పంపిణీతో పాటు అవి మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిసరాల శుభ్రతపై అవగాహన పెంపు ప్రజల భాగస్వామ్యంతో ర్యాలీలు, విద్యార్థులకు వివిధ పోటీల నిర్వహణ చేపట్టాలని ఈ కార్యక్రమం ప్రజలు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక కృషితో పని చేయాలని కోరారు