ప్రతి మహిళ తమ ఇంటి పరిసర ప్రాంతాలలో తప్పకుండా మూడు మొక్కలు నాటాలని మండల పంచాయతీ అధికారి సదాశివ్ అన్నారు. గురువారం మండలంలోని కోన సముందర్ గ్రామంలో వన మహోత్సవంలో బాగంగా గ్రామ మహిళ సమైక్య సంఘ సభ్యులకు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పంచాయతీ అధికారి సదాశివ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన వన వనమహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. అలాగే ప్రతి మహిళ తమ ఇంటి ప్రాంతాల్లో తప్పకుండా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, సిసి వర్ణం శ్రీనివాస్, ఫీల్ అసిస్టెంట్ గోపాల్, కరోబార్ మోహన్, సిఏ బాలమణి, గ్రామ మహిళ సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.