
గులాబీ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటా అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని కొండాపురం, పెర్కవేడు గ్రామాలకు చెందిన పలువురు మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు బిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, గ్రామ పార్టీ ఇంచార్జ్ గుగులోత్ జాజు నాయక్, కొండాపురం సర్పంచ్ కోదటి దయాకర్ రావు, ఎంపీటీసీ బండి అనూష రాజబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొమ్మేర వీరాస్వామి, ఉప సర్పంచ్ మంగిశెట్టి రాజ్, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.