
సీపీఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఐ మండల కార్యదర్శి చాపల శ్రీను అన్నారు. సోమవారం మండలంలోని
చల్మెడ గ్రామంలో గ్రామ శాఖ సమావేశం పగిళ్ల యాదయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పేద ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్టు పార్టీ అని సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఎర్రజెండా ఉంటుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి వచ్చిన తర్వాత దేశాన్ని మతతత్వ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తుందని అదేవిధంగా ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాయడానికి ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేయాలని తక్షణమే ఇల్లు లేని నిరుపేదలకు అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని తెల్ల రేషన్ కార్డులు లేనివారికి వెంటనే ఇవ్వాలని, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ప్రతి ఒక్క రైతుకు 15 ఎకరాలకు వరకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని రైతు పెట్టుబడి సాయం వెంటనే అందించాలని వారి డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ లో మన పార్టీ ఎక్కువ స్థానాలు పోటీ చేసి గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని చల్మెడ గ్రామపంచాయతీ గతంలోని సర్పంచిని గెలిపించుకొని కార్యకర్తలకు అండగా ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు బిలాలు మండల సహాయ కార్యదర్శి బి యాదయ్య ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సతీష్ బు కుమార్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు దశరథ శ్రీపతి గాలయ్య అశోకు తదితరులు పాల్గొన్నారు. గ్రామ శాఖ కార్యదర్శిగా. నందిపాటి అశోక్ సహాయ కార్యదర్శిగా పగిళ్ల యాదయ్య గాలయ్య. ఐదుగురు కార్యవర్గంతోని నూతన కమిటీ ఏయగ్రీవంగా ఎన్నుకున్నారు.