
తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 287 బూతు కమిటీని బుధ వారం నాడు ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ మాట్లాడుతూ ఎన్నికల సమరానికి ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పార్టీ టికెట్ ఎవరికీ కేటాయించిన వారి గెలుపు కోసం సైనికుల వలె అహర్నిశలు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలకు ఆకర్షితులైన పలువురు బిజెపి బి ఆర్ ఎస్ నాయకులు దంతాలపల్లి కృష్ణ,వట్టి పాపయ్య, గంగాధరి హనుమంతు, నాలి అశోక్, లక్ష్మి నరసయ్య, లొంక సతీష్ ,ఎర్ర స్వామి, సుమారు 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.బూత్ కమిటీ నాయకులు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ ల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరు అంబేద్కర్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమీలాల్, కౌన్సిలర్ భాస్కర్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుర్ర శ్రీను, మామిడాల గ్రామ శాఖ అధ్యక్షులు గజ్జి లింగన్న, మాజీ ఎంపిటిసి దుప్పల్లి అబ్బాస్, కాంగ్రెస్ నాయకులు తండు యాకన్న,మహేష్, శేఖర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్, యశ్వంత్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.