
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షురాలు మేకల పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో అధ్యక్షులు ఏరుకొండ నరసింహ ఆధ్వర్యంలో బిజెపి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా స్వాతి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సర్పంచ్ లు వార్డు మెంబర్ ఎంపీటీసీ లు ప్రతి గ్రామంలో గెలిపించుకోవాలని,ప్రతి గ్రామంలో చురుపైన కార్యకర్తలు క్రియశిల సభ్యత్వాలు నమోదు చేయాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా వివరించాలని తెలిపారు. దీనికి గాను ఇప్పటినుంచే కార్యాచరణ చేపట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పెద్దవూర మండల అసెంబ్లీ కన్వీనర్ పాల్తి శంకర్ నాయక్, బిజెపి సీనియర్ నాయకులు చిట్టిమల్ల సరేష్, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి ఏడుకొండ పద్మ, జూలకంటి మట్టారెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు రమవత్ విజయ, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.