ప్రతి కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలి

– మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల

నవ తెలంగాణ- మల్హర్ రావు: కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి  కార్యకర్త ఒక సైనికునిలా పని చేయాలని తెలంగాణ మేనిపేస్టో చైర్మన్, మంథని కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి  కాంగ్రెస్ పార్టీలో  చేరారు. వారికి శ్రీదర్ బాబు కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. తాడిచెర్ల నుంచి వార్డు సభ్యురాలు తమ్మిశెట్టి పద్మ తోపాటు 30మంది, ఎడ్లపల్లి గ్రామంలో 20మంది,పెద్దతూoడ్ల నుంచి 20మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంథని అభ్యర్థి దుద్దిళ్ల శ్రీదర్ బాబు చేస్తున్న అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో లో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మలహల్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొoడయ్య, మాజీ జెడ్పిటిసి కొండ రాజమ్మ, ఉప సర్పంచ్ చెంద్రయ్య, నాయకులు బొబ్బిలి రాజు గౌడ్, కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, రాజయ్య, రాజా సమ్మయ్య పాల్గొన్నారు.