– నియోజకవర్గంలో అత్యధిక యూత్ కాంగ్రెస్ సభ్యత్వాలు చేయాలి
– రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు
నవ తెలంగాణ మల్హర్ రావు/కాటారం
ప్రతి యూత్ కార్యకర్తకు అండగా ఉంటామని,మంథని నియోజకవర్గంలో అత్యదికంగా సభ్యత్వాలు చేయించాలని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు.కాటారం మండలంలో ధన్వాడ గ్రామంలోని ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వగృహంలో ఆదివారం మంథని నియోజకవర్గ స్థాయి యూత్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం కార్యక్రమానికి శ్రీను బాబు హాజరై మాట్లాడారు రానున్న యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో మంథని నియోజకవర్గ పరిధిలోని 10 మండలాల, మంథని నియోజకవర్గ సంబంధించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉన్న అభ్యర్ధులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. అభ్యర్థులు ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు జరగనున్న యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మంథని నియోజకవర్గన్ని అత్యధిక సభ్యత్వాలు చేసి రాష్ట్రం లోనే మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు