ప్రతీ ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది

Everyone is connectedనిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌.ఎల్‌. పి, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని నేడు (శుక్రవారం) వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో మాట్లాడుతూ, ‘వంశీ మ్యూజిక్‌తో పాటు ఈ కథను నాకు వినిపించారు. అనుదీప్‌ అప్పటికే మ్యూజిక్‌ చేసేశారు. నెరేషన్‌ అద్భుతంగా ఇచ్చాడు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ పర్సనల్‌ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌కి వంశీ అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్‌ ఏదో ఒక క్యారెక్టర్‌తో ట్రావెల్‌ చేస్తారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. మా అన్నా, వదినలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది. ఈ మూవీ చూసి నన్ను అభినందించారు. సెన్సార్‌ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది. అలాగే ప్రేక్షకులకూ బాగా నచ్చుతుంది’ అని తెలిపారు.