మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది: జెడ్పి సీఈఓ రమేష్

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి  ఒక్కరిదని జెడ్పి సీఈఓ రమేష్ అన్నారు. శుక్రవారం స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని పెద్ద గుండవెల్లి , బల్వంతపూర్ గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం  మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. పరిశుభ్రతలతోనే వ్యాధులు దూరమవుతాయని సూచించారు. ఇళ్లలోని తడి ,పొడి చెత్తను కేవలం గ్రామపంచాయతీ చెత్తబండికే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర శర్మ , ఎంపీ ఓ నరేందర్ రెడ్డి , ఏఈ రోహిత్  శ్రీ వాస్తవ, గ్రామ కార్యదర్శులు తదితరులు న్నారు.