
నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆర్టీఏ కార్యాలయం నుంచి వర్ని చౌరస్తా వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంవీఐలు కిరణ్ కుమార్, రాహుల్ కుమార్, ఐదో పోలీస్ స్టేషన్ ఎస్సై గంగాధర్, లక్ష్మయ్య, ఇబ్బంది తదితరులు పాల్గొన్నారు.