గంజాయి నిర్ములనకై ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఎస్సై వెంకన్న తెలిపారు. బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో ఎస్పీ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలన్నారు. మత్తు సకల అనర్ధాలకు, అరాచకాలకు, హత్యలకు ప్రేరణ కలిగిస్తాయన్నారు. గంజాయి, డ్రగ్స్ మారుమూల గ్రామాలకు పట్టణాలకు వ్యాప్తి చెందడం అత్యంత ఆందోళన కలిగించే విషయమన్నారు. గంజాయిని తరిమికొట్టేది మన చేతుల్లోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.