– మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్
– జాయింట్ సెక్రటరీ మహమ్మద్ ఖాజ
నవతెలంగాణ-బాలానగర్
ప్రతి ఒక్కరూ వైద్య శిబిలాలను వినియోగించుకోవాలని మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మహమ్మద్ ఖాజ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం మూసాపేట్ సర్కిల్ ఫతేనగర్ డివిజన్ పరిధిలోని మాధవీ నగర్‌లో బస్తీ ప్రజల సౌకర్యార్థం కోసం మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఎండీ ఖాజ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖాజ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ప్రతీ ఆరు నెలలకోసారి తమ ఆరోగ్య స్థితిగతులపై పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వారికి పలు సూచనలు ఇవ్వడంతో పాటు ఆరోగ్య జాగ్రత్తలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరికీ, సహకరించిన నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.