పౌర హక్కుల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

నవతెలంగాణ – క్రిష్ణా 

రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల తహసీల్దార్ బి వెంకటేష్ అన్నారు. మండల పరిధిలోని హిందూపూర్ గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు ఉంటాయని, భంగం కలిగించిన వారు ఎంతటి వారైనా సరే శిక్షార్హులవుతారన్నారు. కుల, మత, వర్ణబేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఐక్యమత్యం, సోదరి భావంతో ఉండాలన్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు. అనంతరం ఏఎస్ఐ సురేంద్రబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఐక్యతతో శాంతియుతంగా సమానత్వంతో కలిసి మెలిసి ఉండాలని, విద్యతోనే విలువలు పెరుగుతాయి కాబట్టి పిల్లలకు మెరుగైన విద్య అందేలా తల్లిదండ్రులు బాద్యతలు చేపట్టాలన్నారు. పిల్లల చదువులు మద్యలోనే ఆపివేయకుండా వారిని ప్రోత్సహించి చదివిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పిస్తున్న పౌర హక్కులపై పూర్తి అవగాహన కలుగుతుందని గ్రామస్ధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.