ట్రాఫిక్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…

Everyone should be aware of traffic...– ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులచే ర్యాలి..
– ఎస్సై రామ్మోహన్ 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ట్రాఫిక్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తంగళ్ళపల్లి ఎస్సై రామ్మోహన్ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా  మైనర్ల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరిగింది అన్నారు. ట్రాఫిక్ అవగాహన లోపం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనదారుడు మధ్య సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాల బారిన పడతారన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిరంతరం వాహనాల తనిఖీ జరుగుతుందన్నారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.