అందరూ ఓటు వేసేలా చైతన్యం చేయాలి

– అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
జిల్లా వ్యాప్తంగా స్వీప్‌ కార్యక్రమాలను మ రింత విస్తతం చేయాలని, అందుకు అవస రమైన యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సంబంధిత నోడల్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత నోడల్‌ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, రవాణా శాఖ, పరిశ్రమలు, డి డబ్ల్యు ఓ తదితరులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీప్‌ కార్యక్రమాలను విస్తతం చేయాలని సూచించారు. పిడబ్ల్యుడి ఓటర్ల మార్కింగ్‌ చేసిన లిస్టు మేరకు పోలింగ్‌ కేంద్రాల వారిగా పిడబ్ల్యుడి ఓటర్లకు ఎంత మందికి రవాణా సౌకర్యం అవసరమో రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పి.డబ్ల్యూ డి అధికారికి సూచించారు. 80 సంవత్సరాలు దాటిన సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు, ఓటరు జాబితాలో మార్కింగ్‌ కలిగిన దివ్యంగ ఓటర్లు తమ ఇంటి నుండే ఓటు వేసే వెసులుబాటు ఉన్నందున అవసరమైన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కు ( 12 – డీ ) బీ.ఎల్‌.ఓ లకు అందజేసెలా చర్యలు తీసుకో వా లన్నారు. 40 శాతానికి మించి వైకల్యం కలిగిన దివ్యంగులకు మాత్రమే ఇంటి నుండి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. పరిశ్రమల్లో పని చేస్తున్న వర్కర్లు, వారి కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు 712 పరిశ్రమలలో 712 ఓటర్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. రేపటినుండి స్పెషల్‌ మొబైల్‌ క్యాంప్స్‌ ఏర్పాటు చేయాలని పోలింగ్‌ స్టేషన్‌ వారిగా పిడబ్ల్యుడి ఓటర్లకు ఈవీఎం వీవీ ప్యాట్‌ పై ఓటింగ్‌ వేయడం పై అవగాహన కల్పించాలని, ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య పరచాలని తెలిపారు. సీనియర్‌ సిటిజన్స్‌, పిడబ్ల్యుడి, థర్డ్‌ జెండర్‌, కార్మికులు, తదితర ఓటర్లందరూ వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య పరచాలని సూచించారు. సమావేశంలో డిఆర్‌ఓ నగేష్‌, జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారి అఖిలేష్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్‌ కమిషనర్‌ శివలింగయ్య, డి డబ్ల్యుఓ సంధ్యారాణి, ఎన్నికల విభాగపు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.