ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

Everyone should be registered to voteనవతెలంగాణ – జన్నారం
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మంచిర్యాల డిఆర్డిఏపిడి జన్నారం మండల స్పెషల్ ఆఫీసర్ కిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులకు, తెలంగాణ సాంస్కృతిక సారది కళాకారులు, తమ ఆట.. పాటల ద్వారా అవగహన కల్పించారు. సందర్భంగా కిషన్ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఫారం నెంబర్ 6 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని, ఓటరు కార్డులో ఏవైన సవరణలు ఉంటే, ఫారం నెంబర్ 8 ద్వారా మార్చుకోవాలి అనీ వివరించారు. అలాగే రానున్నా ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని కళాకారుల పాటలతో చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలొ, ఏఆర్ఎస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ముత్యం సతీష్ , జాబ్ డిస్ట్రిక్ మేనేజర్ రాంచందర్ , కళాకారులు…. రమేష్ లావుడ్యా (టీం లీడర్) మురళి ముల్కల,లచ్చన్న మామిళ్ల,కృష్ణ గొడిసెలా , పోశం వెళ్తూరు,సల్లూరి కిష్టయ్య,నాగలక్ష్మి వావిలాల, .శ్రీనివాస్ బీరుపురి,నిరోషా చేగొండ,రాజేష్ లింగం పల్లి, సంతోష్ కాసిపేట,సత్యనారాయణ సల్లూరి, రవికుమార్ వడక పురం, మరియు విద్యార్థులు పాల్గొన్నా రు.