నవతెలంగాణ – నెల్లికుదురు
మండల శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని నూతన ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపాడు. నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో ఆదివారం నూతన ఎస్ఐ గా చిర్ర రమేష్ బాబు వీధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వి ఆర్ మహబూబాద్ లో విధులు నిర్వహించి నెల్లికుదురు పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చినట్లు తెలిపారు. మండల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. చట్టం పరిధిలోనే నడుచుకోవాలని తెలిపారు. నియమాలను పాటిస్తూ శాంతిభద్రతల పట్ల ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మండలంలోని ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలని అన్నారు. ఆక్రమ రవాణా చేస్తే వారిపై చట్టమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ఐ లు కందునూరి వెంకన్న, గుంటుక యాకన్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి పోలీసు సిబ్బంది ఉన్నారు.