ప్రమాదాల నివారణ కొసం అందరూ సహకరించాలి

– తాడ్వాయి ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి
నవతెలంగాణ తాడ్వాయి: వర్షాల కారణంగా మండల పరిధిలోని రోడ్లపై ఎక్కడైనా చెట్లు పడ్డ, ఏమైనా అంతరాయం ఏర్పడితే బాధ్యతగా అందరూ సహకరించాలని, లేదంటే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి ప్రమాదాల నివారణ కోసం అందరూ సహకరించాలని తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం తాడ్వాయి రోడ్డుపై పడిన చెట్లను ఎస్సై ఆధ్వర్యంలో పోలీస్లు ఆర్మీ రమేష్, కాంతారావులు రోడ్డుకు అడ్డం గా కిందపడిన చెట్లను తొలగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈ వాన కాలంలో చెట్ల విరిగి రోడ్ల గడ్డంగా పడినట్లయితే, రాత్రి సమయంలో మోటార్ సైకిల్, వాహనాలపై వెళ్లే వారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా అడ్డంగా పడి ఉన్న చెట్లను తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.