ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలపర్చుకోవాలి

– జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు
నవతెలంగాణ -కంటేశ్వర్

ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని జిల్లా పరిషత్ చైర్మెన్ దాదన్నగారి విఠల్ రావు అన్నారు.ఇతరులకు సేవ చేయడంలో ఆత్మసంతృప్తి,ఆనందం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి నిజామాబాదు నగరంలోని సందీప్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి విఠల్ రావు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ.. లయన్స్ లాంటి స్వచ్చంద సంస్థలు సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని కొనియాడారు..ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలు తోడవుతున్నాయన్నారు..ఎలాంటి స్వార్దం లేకుండా సేవే లక్ష్యంగా పని చేస్తున్న లయన్స్ క్లబ్ లాంటి స్వచ్చంద సంస్థలకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని విఠల్ రావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అద్యక్ష కార్యదర్శులు జిల్కార్ విజయానంద్,చింతల గంగాదాస్ తదితర కార్యవర్గం చేత లయన్స్ ఏరియా కో-ఆర్డినేటర్ పి.లక్ష్మినారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్లు పి.బసవేశ్వర రావు,డి.పెంటయ్య,ప్రోగ్రామ్ చైర్మెన్ కరిపె రవీందర్,పర్మినెంట్ ప్రాజెక్ట్స్ కార్యదర్శి డి.యాదగిరి, లయన్స్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస రావు, కోశాధికారి కొడాలి కిషోర్, రీజియన్ చైర్మెన్ శంకర్,జోన్ చైర్నెన్ రమేష్ బాబు,లయన్స్ ప్రతినిధులు సూర్యనారాయణ, ఉండవల్లి శివాజీ, ద్వారకాదాస్ అగర్వాల్, నాగేశ్వరరావు, సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు.