నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పరీక్షలలో ప్రతి ఒక్కరు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులు కావాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న కానిస్టేబుల్ లకు రెండవ సెమిస్టర్ చివరి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షా కేంద్రాన్ని ఎస్పీ సందర్శించి పరిశీలించారు. 9 నెలల పాటు శిక్షణను తీసుకొని చివరి రాత పరీక్షలను రాస్తున్న 254 మంది శిక్షణ కానిస్టేబుళ్ళు, నాలుగు రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నుండి విచ్చేసిన ప్రత్యేక పరీక్షల నిర్వహకులు ఆదిలాబాద్ జిల్లా లోని శిక్షణ కానిస్టేబుల్ లకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినీయం, బిఎస్ఏ లలో పరీక్షను శిక్షణ కానిస్టేబుల్ రాస్తున్నట్లు మిగిలిన వాటిలో తదుపరి మూడు రోజులు పరీక్షలు ఉండబోతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ సి సమయ్ జాన్ రావు, నిజామాబాద్ సిటిసి ఎసిపి సయ్యద్ మస్తాన్ అలీ, ఆర్ఐ కార్తీక్, ఆర్ఎస్ఐ రాకేష్, సిబ్బంది పాల్గొన్నారు.