
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలని సూపర్వైజర్ అన్వరున్నిస బేగం అన్నారు. మండలంలోని చీకటిమామిడి సెక్టర్ ఖాజీపేట గ్రామంలో శనివారం పోషన్ మాసం సందర్భంగా చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారించుట గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి,చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిరుధాన్యాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.చిరుధాన్యాలతో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మహిళలు, బాలింతలు, రక్తహీనత ఉన్నవారు వాటిని తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్ శశికళ, అంగన్వాడి టీచర్ స్వప్న, అంగన్వాడి టీచర్లు, గర్భిణులు పాల్గొన్నారు.