ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలి

– రవీందర్ ములుగు డి.ఎస్.పి
నవతెలంగాణ-గోవిందరావుపేట:
పసర లో పోలీసు బలగాల ఫ్లాగ్ మార్చ్ శాంతియుత వాతావరణం లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ములుగు జిల్లా డిఎస్ పి రవీందర్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర గ్రామంలో సిఐ శంకర్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు,  సివిల్ పోలీసుల తో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ములుగు డి.ఎస్.పి రవీందర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని అన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని ఓటు హక్కును ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా స్వేచ్ఛ వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని శాంతియుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకున్ని ఎంచుకొని ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా ఎస్ ఐ షేక్ మస్తాన్ తాడ్వాయి ఎస్ ఐ ఓంకార్,  సివిల్, సిఆర్పిఎఫ్ బలగాలు పాల్గొన్నారు.