ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ఆర్డీవో అనంత రెడ్డి

– ఇబ్రహీంపట్నంలో ర్యాలీ, మానవహారం
నవతెలంగాణ-రంగారెడ్ది ప్రతినిధి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి పిలుపునిచ్చారు. ఎస్వీఈఈపీ కార్యక్రమంలో భాగంగా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అందుకోసం గ్రామీణ ప్రాంతంలో బీఎల్వోలు ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. 100శాతం పోలింగ్‌ జరిగే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ శ్రీమతి సునీత, డీడబ్ల్యుఓ పద్మరాణి, సీడీపీఓ శాంతశ్రీ, డీప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.