మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వర్తించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో పలువురు మాట్లాడుతూ.. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని గాంధీజీ అన్నట్లు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ బాపూజీ అడుగు జాడల్లో నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు, ఆశా కార్యకర్తలు, ఐకేపీ మహిళలు పాల్గొన్నారు.