– అన్న బావు సాతే జయంతి ఉత్సవాల్లో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండలంలోని కొడిచరా గ్రామంలో శుక్రవారం నాడు అన్న బావు సాటే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామ సర్పంచ్ సంతోష్ పటేల్ అధ్యక్షతన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. లోక్ శాహిర్, సాహిత్య రత్న, అన్నా బావు సాటే గారి 103 జయంతి మహోత్సవ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గం ఇంఛార్జ్ సౌదగర్ గంగారాం, డా. బండివార్ విజయ్, ఉప సర్పంచ్ వీరభద్ర పటేల్,జుక్కల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ హన్మంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సౌదగర్ అరవింద్, మాజి ఎంపీటీసీ నగేశం, మాజి సర్పంచ్ నాగేష్, బాస్వరజ్ దేశాయ్, సుధాకర్, భగవాన్, మారుతీ దసర్ వార్, నాగ్ నాథ్ దసర్ వార్, అన్న బాహు సాటే ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.