భారత రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని మిరుదొడ్డి తహాసిల్దార్ గోవర్ధన్, ఎస్సై నరేష్. లు అన్నారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఎస్ఐ ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధనిక పేద అనే భేదం లేకుండా అందరికీ సమానమైన హక్కులు రాజ్యాంగంతోనే సాధ్యమన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు పరచడంతో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు భారతదేశంలో పొందడం జరుగుతుందన్నారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముందు తహాసిల్దార్ గోవర్ధన్, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీడీవో రాజిరెడ్డి, మండల సమైక్య కార్యాలయం ముందు ఏపీఎం కృష్ణారెడ్డి, మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట ఏఈఓ సాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సమీనా సుల్తానా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం పలు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం ముందు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ల ఆధ్వర్యంలో త్రివర్ణ జెండా నెరవేశారు. రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరు నడుచుకోవాలి
నవతెలంగాణ- మిరు దొడ్డి