
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వర రావు సూచించారు. గురువారం పట్టణంలో రోడ్డు భద్రత వారోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలను క్లుప్తంగా వివరించారు. అలాగే విద్యార్థులు వాహనదారులకు పండ్లను అందజేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం వి ఐ వివేకానంద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.